మిచౌంగ్ తుఫాన్… రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

-

ఏపీ రైతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో… రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. ధాన్యంలో తేమశాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

CM Jagan gave good news to the farmers

ధాన్యంలో తేమశాతం అస్సలు పట్టించుకోవద్దు… ధాన్యం సేకరించి వెంటనే బిల్లుకు తరలించాలన్నారు. ఏడు జిల్లాలలో రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ఆదేశించారు సీఎం జగన్. సదరు జిల్లాలలో డ్రయర్లు లేకుండా పరుగు జిల్లాలకు పంపాలి.. అందుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా భరించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ క్రమం రేపు మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version