పవన్‌ కల్యాణ్‌కు కీలక సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య లేఖ..!

-

జనసేన బాగోగులు కోరే కాపు నాయకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కు మరో లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు కీలక సూచనలు చేశారు. మీ పాలనలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నానని , అభివృద్ధి కూడా ఒకేచోట కేంద్రీకరించొద్దని సూచించారు. సంక్షేమ ఫలాలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలే తప్పా రాజకీయ లబ్ధి కోరే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు.

గతంలో చంద్రబాబు కాపు  లను బీసీల్లో చేరుస్తామని, రిజర్వేషన్లు  కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. పవన్‌ సినిమాలు మానేయకుండా సగం రోజులు షూటింగులు, మిగిలిన సగం రోజులు రాష్ట్ర పరిపాలనకు కేటాయించాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా సందేశాత్మకంగా సినిమాలు చేయాలని సూచించారు. జిల్లా, మండల పరిషత్‌, పంచాయతీరాజ్‌ వ్యవస్థలను ఆ శాఖ మంత్రిగా బలోపేతం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version