కొవ్వుపట్టి పోస్టులు పెడితే వదిలెయ్యాలా..? సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

-

సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై కొందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. మదమెక్కి కొందరూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పిల్లలపై కూడా ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వారిని వదిలి వేయాలా..? ఇలాంటి వారికి ప్రజాస్వామ్యం ముసుగులో మద్దతిస్తారా..? అంటూ ప్రతిపక్ష నేతలను నిలదీశారు చంద్రబాబు. 

అసెంబ్లీ వేదికగా నా భార్యపై కామెంట్స్ చేశారు. బాంబులకు బయపడలేదు. కానీ నా భార్య పై కామెంట్స్ చేయడం బాధ వేసి కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేశారు చంద్రబాబు. ఎవరైనా సరే హద్దులు మీరి వ్యవహరిస్తే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బరితెగిస్తున్న వారి ఆటలను కట్టడి చేసే సమయం వచ్చేసింది. ఆడబిడ్డలను అవమానించే రాజకీయ పార్టీలు రాష్ట్రానికి అవసరమా..? అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version