అధికారంలోకి వచ్చినప్పటినుండి జగన్ ప్రజలను ఫూల్స్ ని చేస్తూనే ఉన్నాడు – బోండా ఉమ

-

వైసిపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి నేత బోండా ఉమామహేశ్వర రావు. శుక్రవారం బిజెపి జాతీయ నాయకుడి పై జరిగిన దాడి వెనుక వైసిపి కిరాయి గుండాల హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా బిజెపి జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులను గమనించాలని కోరారు. ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% నెరవేర్చామని చెప్పుకుంటున్న వైసిపి.. ఎక్కడ నెరవేర్చారో చెప్పాలని నిలదీశారు.

15 లక్షల మందికి పెన్షన్ డబ్బులు ఎగ్గొట్టారని, విద్యుత్ చార్జీల పెంపుతో 57 వేల కోట్లు రాబట్టారని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ ప్రజలను ఫూల్స్ ని చేస్తూనే ఉన్నాడని వివరించారు బోండా ఉమా. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో కట్టింది ఐదు ఇల్లు మాత్రమేనని పార్లమెంట్ లో నిరూపితమైందన్నారు. నవరత్నాలలో ఒక్క రత్నాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news