ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నైపుణ్యాభివృద్ధి పై మంత్రి బుగ్గన సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ ఆటోనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో సమావేశంలో జరిగింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
స్కిల్ యూనివర్స్ పేరుతో త్వరలో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని.. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో డాష్ బోర్డు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ట్రైనింగ్, ప్లేస్ మెంట్ ల సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డు ఏర్పాటు చేసినట్లు..ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్ సంయుక్త శిక్షణ వివరాలు పోర్టల్ లో అప్ లోడ్ చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. ల్యాబ్ టెక్నిషిన్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగాల ఖాళీల నివేదిక సిద్ధం చేయండని ఆదేశించారు.