ఏపీ ప్రభుత్వ వైద్యులకు సీఎం జగన్ దిమ్మతిరిగే షాక్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యుల కు జగన్ మోహన్ రెడ్డి సర్కారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నిన్న ఏపీ కేబినేట్‌ చివరి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా… ఏపీ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వైద్యులకు షాక్ ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కారు. ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయకుండా వారిపై నిషేధాజ్ఞలు విధించింది ప్రభుత్వం.

దీనిపై నియమ నిబంధనలు రూపొందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించడం పై వైద్యులు దృష్టి సారిస్తానని… వెల్లడించారు సీఎం జగన్. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేటు వైద్యం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని.. ఈ నేపథ్యంలో.. తమ ఆదేశాలను ప్రభుత్వ వైద్యలు పాటించాలని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news