పచ్చి బొప్పాయి తినే అలవాటుందా.. అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే

-

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఈ విషయం ప్రస్తుతం అందరిని ఒకింత భయాందోళనకు గురిచేస్తుంది. గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచన అందరిలో మొదలైంది. ఎదిగిన కొడుకు లేదు..వయసుమళ్లిన తాతలేదు, పెళ్లైన కూతురు లేదు, కాలేజ్ కు వెళ్లే కుమారుడు లేదు.. అన్ని వయసుల వారిని హార్ట్ ఎటాక్ ప్రభావితం చేస్తుంది. దీని భారిన పడకుండా ఉండాలంటే.. పచ్చిబొప్పాయి పనికొస్తుందని నిపుణులు అంటున్నారు.

హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ పచ్చి బొప్పాయిని ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పోటును నియంత్రించడంలో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. పచ్చి బొప్పాయిలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ బీ, సీ, ఈ లు ఇందులో మెండుగా ఉన్నాయి. పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం లభిస్తాయి. కాబట్టి పచ్చి బొప్పాయి ముక్కలను కూరగా, లేదా పప్పులో కలుపుకుని వండుకుని తినొచ్చు..

ఈ విషయం అందరికి తెలిసే ఉంటుంది.. పిరయడ్స్ లో వచ్చే సమస్యలను తగ్గించడంలో పచ్చిబొప్పాయి పనికొస్తుంది..అలాగే ఈ కాయలో ఉండే.. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఆస్తమా, రుమటాయిడ్ ఆర్దరైటిస్, ఆస్టియో ఆర్దరైటిస్ వంటివి రాకుండా నిరోధిస్తాయట. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అజీర్తి సమస్యలతో బాధపడేవారు పచ్చి బొప్పాయితో వండిన వంటలను తింటే చాలా మేలు. జీర్ణ సమస్యలు తగ్గి పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.

అయితే ఈ సమస్యలు ఉన్నవారితో పాటు.. మాములు వ్యక్తులు కూడా పచ్చిబొప్పాయితో వివిధ రకాల వంటలు చేసుకుని తినటం మొదలుపెట్టండి. అయితే.. మీకు పచ్చిబొప్పాయి వాడటంలో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా.. వాడాలంటే అనుమానంగా ఉన్నా.. మీ వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్యపరిస్థితులకు పచ్చిబొప్పాయిను ఎంతమేర వాడాలో చెప్తారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు కూడా వైద్యుల సలహా మేరకే వాడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news