అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంపై మాజీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారని.. ఈఎంలు కాదని తెలిపారు. అందుకే ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో కూడా EVMలు కాకుండా… ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లు వాడేలా చూడాలని అర్థం వచ్చేలా సంచలన పోస్ట్ పెట్టారు జగన్.
మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని కోరారు. న్యాయం జరగడం మాత్రమే కాదు..అది ఆచరణలో కనిపించాలని… ఈవీఎంల వాడకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు జగన్.
https://x.com/ysjagan/status/1802892290257789049?s=48&t=orS8SClPELIFdoLrGXyzLQ