చిత్తూరు జిల్లా రంగంపేట లో ప్రారంభమైన జల్లికట్టు..!

-

చిత్తూరు జిల్లా రంగంపేటలో పౌరుషాలపట్టు.. జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున జల్లికట్టు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జల్లికట్టు కోసం సిద్ధం చేసిన కోడెద్దులు గ్రామ వీధుల్లో రంకెలు వేస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం తో పాటు తిరుపతి, పీలేరు నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి జల్లికట్టును తిలకిస్తున్నారు. జల్లికట్టు పోటీల్లో పశువులకు ప్రత్యేకంగా అమర్చిన బహుమతి పలకలతో కూడిన పౌరుషాల కోడె ఎద్దులను రంగంపేటలోని వీధుల్లో వదిలిపెట్టగా.. వాటికి ఎదురెళ్లి వాటిని లొంగ తీసుకొని వాటికి కట్టి ఉన్న పలకల బహుమతులను తమ సొంతం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో యువకులు పోటీలు పడుతున్నారు.

తమకు నచ్చిన సినిమా హీరోల, రాజకీయ పార్టీ నాయకుల బొమ్మలను పలక మీద అలంకరించి నగదు బంగారు, వెండి, వంటి విలువైన బహుమతులను మూట కట్టి జల్లికట్టులో వదిలేస్తారు. విలువైన ఈ పలకల బహుమతులను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఈ బహుమతులను గెలుచుకునేందుకు తమిళ నాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహిస్తే.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహిస్తారు. కోడిగిత్తల రంకెలు.. హుషారత్తే యువకులతో పల్లెల్లో సంక్రాంతి సంబరాలు జల్లికట్టుతో కొనసాగుతాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సాహస క్రీడా ఆనాదిగా కొనసాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version