గుడివాడ కొడాలి నాని అడ్డా.. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ఈక కూడా పీకలేరు – జోగి రమేష్

గుడివాడ కొడాలి నాని అడ్డా.. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ఈక కూడా పీకలేరని మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడను ఎవరూ చెక్కు చెదర్చలేరని.. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే ఈ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. మరో 25 ఏళ్లు జగనే సీఎం అని… చంద్రబాబు గుడివాడకు వచ్చి ఏం చెప్తాడని నిలదీశారు.

jogi ramesh

కొడాలి నాని ఓడిస్తానని చెబుతాడా…ఇది జరిగే పనేనా ?? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్… ఇంకా ఎంత మంది కలిసినా కొడాలి నానిని ఏం చేయలేరని ఎద్దేవా చేశారు. అందరూ కలిసొచ్చినా ఈక కూడా పీకలేరని స్పస్టం చేశారు మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టుకుని ఇప్పుడెలా నిమ్మకూరు వస్తావ్ చంద్రబాబు?? నిమ్మకూరులో చంద్రబాబు బస చేస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్. గుడివాడకు ఒక బ్రాండ్ తెచ్చిన వ్యక్తి కొడాలి నాని అని.. గుడివాడలో కొడాలి నానిని ఓడించటం కాదు కదా అసలు టీడీపీ నుంచి నిలబడే వ్యక్తి ఎవరు?? అని ప్రశ్నించారు.