నేడు ఏపీ లో పర్యటించనున్న జేపీ నడ్డా..జనసేన తో పొత్తులపై చర్చించే అవకాశం

-

బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో అంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బిజెపి శక్తి కేంద్రాలుగా మార్చింది. వాటికి ఇన్చార్జీలను నియమించింది. ఈ నేపథ్యంలో ఆయా శక్తి కేంద్రాల ఇన్చార్జిల తో విజయవాడలో నడ్డా బేటీ అవుతారు.

సాయంత్రం 5 గంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పురప్రముఖులు తో సమావేశం కానున్నారు. రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశం అవుతారు. అందులో పార్టీ భవిష్యత్, వ్యూహాలపై చర్చిస్తారు. రాత్రికి విజయవాడలోనే బస చేయనున్న నడ్డా.. మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. జనసేన తో పొత్తులపై ఎలా వెళ్లాలి అనేది తమ పార్టీ జాతీయ నాయకులు నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news