పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఎంతగా కౌంటర్లు ఇస్తున్నామా.. అనేదే లెక్క!! అంటున్నారు కొమ్మా రెడ్డి పట్టాభిరాం. బెజవాడ టీడీపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న పట్టాభి.. ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వా న్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. వాస్తవానికి పార్టీలో ఆయన సీనియరే. పార్టీ తరఫున పత్రికలు, మీడి యా చర్చల్లోనూ పట్టాభి పాల్గొంటారు. ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది. సాధారణంగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఇంతకు మించిన పని ఏముంటుంది? అనే అనుకున్నారు ఇప్పటి వరకు. దీంతో బెజవాడ టీడీపీలో ఆయనను పెద్దగా ఎవరూ లెక్కచేసేవారు కాదు. తాము తప్ప.. పార్టీ తరఫున బలమైన గళం వినిపించేవారు ఎవరూ లేరని కూడా తమ్ముళ్లు అనేవారు.
కానీ, వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే..పట్టాభి దూకుడు ముందు బెజవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా సరిపోవడం లేదు. రోజుకో విషయంతో అధికార పార్టీలో ఉక్కపోత రేపుతున్నారు పట్టాభి. నాలుగు రోజుల కిందట 108 అంబులెన్సుల విషయంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు చేసిన విమర్శలకు భిన్నంగా సకల ఆధారాలతో పట్టాభి ఉతికి ఆరేశారు. అధిక మొత్తాలకు అరవింద గ్రూప్‌కు అంబులెన్సుల కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారంటూ.. ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
అదే సమయంలో ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం లోనూ ప్రభుత్వం విఫలమైందని, గత బీజీవీ కాంట్రాక్టును ముందుగానే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించారు. సాధారణంగా పట్టాభిదూకుడుపై టీడీపీలో ఆదిలో జరిగిన చర్చ ఏంటంటే.. ఆయన ఎన్ని ఆరోపణలు చే స్తే.. మాత్రం ఏముంటుంది. ప్రభుత్వం పట్టించుకుంటుందా? అనుకున్నారు. కానీ, ప్రభుత్వం పట్టించు కుని వివరణ ఇచ్చింది. తాము అంబులెన్సుల కాంట్రాక్టును ఎందుకు కుదుర్చుకున్నామో.. ఎందుకు ఎ క్కువ మొత్తాన్ని కేటాయించామో కూడా గణాంక సహితంగా వివరించింది. దీంతో టీడీపీ నేతలు ఖంగు తి న్నారు.పట్టాభి రేటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
తాజాగా పట్టాభి సీఎం జగన్‌నే టార్గెట్ చేశారు. ఆయన సొంత కంపెనీ సరస్వతి సిమెంట్ వ్యవహారంలో హైకోర్టును తప్పుదోవపట్టించారంటూ.. సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈవిషయం భారీగా చర్చకు వచ్చింది. ఈ పరిణామాలతో విజయవాడ టీడీపీ లో పట్టాభి ఒక ఐకాన్ అయిపోయారు. ఇప్పటి వరకు పార్టీ తరఫున వాయిస్ వినిపించిన నాయకులు అందరూ కూడా డమ్మీలుగా మారిపోగా.. పట్టాభి మాత్రం ఠీవీగా ఉన్నారు. దీంతో అరె.. ఈనేంట్రాబాబూ.. ఇలా రెచ్చిపోతున్నాడు.. మనల్ని దాటేస్తాడా ఏంటి?.. అంటూ నేతలు చర్చల్లో మునిగిపోయారు.