ఏపీ దేవాలయాలకు మహర్దశ.. ఇక నెలకు రూ. 5000 !

-

 

ఏపీ దేవాలయాలకు మహర్దశ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రూ.539 కోట్ల సిజిఎఫ్ నిధులతో దేవాలయాల పునరుద్ధరణ, కొత్త వాటిని నిర్మిస్తున్నామన్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8 వేల దేవాలయాలకు దూపదీప నైవేద్య పథకం కింద రూ. 5000 ఇస్తామన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 59 మంది గ్రేడ్ 3 ఈవోల నియామకం చేపట్టాం. 54 మందికి అలాట్మెంట్ కూడా ఇచ్చామన్నారు.

kottu sathyanarayana on ap temples

తిరుపతిలోని హాథిరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్ ను తొలగిస్తూ ధార్మిక పరిషత్ ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. ఆయనపై వచ్చిన 16 అభియోగాలు రుజువైనట్టు ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మతానికి సంబంధించిన స్థిరచరాస్తులు, బంగారం, వెండి, నగదు వివరాలను మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు ఎదుట రికార్డు చేయాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. మహంతును నియమించే వరకు మఠం బాధ్యతలను రమేష్ నాయుడే నిర్వర్తిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version