ఏపీలో విద్యుత్ లోటు ఉంటే సీఎం జగన్, మంత్రి గాడిదలు కాస్తున్నారా..? అని ఫైర్ అయ్యారు లోకేష్. జగన్ మోసపు రెడ్డి ఏపీలో కొత్త పథకం తెచ్చారని.. ఉగాది నుంచి పేదలపై ఛార్జీలతో బాదేస్తున్నారని ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం నాడు రెండు చేతులూ ఊపుతూ జగన్ ఆవేశంగా చెప్పారని.. అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ. 12 వేల కోట్లు లాగేశారని మండిపడ్డారు.
అనేక పేర్లతో విద్యుత్ ఛార్జీలను పెంచి డబ్బులు లాగేశారని.. చెత్త పన్ను వేశారు.. ఇంటి పన్ను పెంచారు.. చివరకు ఇంట్లో కుక్కల పైనా పన్నులేశావు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా విద్యుత్ ఛార్జీలు పెంచారని.. ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు ఉన్నాయన్నారు. పేదలు బాధపడాలి.. ధనవంతులు ఇబ్బంది పడాలి.. ఇదేనా జగన్ విధానమని చెప్పారు.
తాడేపల్లి ప్యాలెస్సుకు విద్యుత్ ఛార్జీలు పెరగకూడదనుకున్నారా..? పీపీఏలు రద్దు చేయడం వల్లే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే పరిస్థితే ఉండేదని.. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదు.. ఛార్జీలను తగ్గించే దిశగా చంద్రబాబు కృషి చేశారని గుర్తు చేశారు.