58వ రోజు కొనసాగుతున్న నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర

-

ఈరోజు తో 58వ రోజుకు చేరింది టీడీపీ నేత నారా లోకేశ్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర జరుగుంతుంది. బత్తలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు నారా లోకేశ్. సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు లోకేష్. ఈ నేపధ్యం లో లోకేశ్ మాట్లాడుతూ… కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం అని పేర్కొన్నారు. తనను కార్యకర్తలే తమ భుజస్కందాలపై మోస్తున్నారని తెలిపారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. ధర్మవరం చేనేతకు పుట్టినిల్లు అని లోకేశ్ వ్యక్తపరిచారు. ఎంతో చరిత్ర ఉన్న ధర్మవరంలో పాదయాత్ర చేయడం తన అదృష్టమని అన్నారు ఆయన.

పాదయాత్రలో తనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు . తన వాహనం, మైక్, చివరికి స్టూల్ ను కూడా లాక్కున్నారని తెలిపారు లోకేష్. కానీ రాయలసీమ ప్రజలు తనకు అండగా నిలిచారని తెలిపారు. తాను టెర్రరిస్ట్ ను కాదని, వారియర్ ని అని అన్నారు. వెనుకంజ వేసే ప్రసక్తే లేదని అన్నారు లోకేష్. బీసీలకు జగన్ వెన్నుపోటు పొడిచారని, బీసీలపై దాదాపు 26 వేల దొంగ కేసులు పెట్టారని లోకేశ్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని తెలియచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జాకీ, అమరరాజా కంపెనీలను తెలంగాణకు పంపించివేశారని అన్నారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన చంద్రబాబు అని అన్నారు. టీడీపీ హయాంలోనే ధర్మవరం అభివృద్ధి జరిగిందని వ్యక్తపరిచారు లోకేష్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version