పీఆర్సీ ర‌గ‌డ‌లో తేలనివి ఎన్నో?

-

ఒక్క‌సారి ఈ ఫొటో చూడండి..ఏపీ జీఈఏ విడుద‌ల చేసిన ఫొటో ఇది.అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం విడుద‌ల చేసిన ఫొటో ఇది.ఇందులో గ‌త పీఆర్సీకి ఈ పీఆర్సీకి ఉన్న వ్య‌త్యాసాలు వివ‌రించారు. బాగుంది. ఆయ‌న లెక్క ప్ర‌కార‌మే చూస్తే 15 రూపాయ‌లు మాత్ర‌మే తేడా చూపిస్తుంది.ఇది ఓ చోట క‌నిపించిన వివ‌ర‌మే అనుకుందాం.ఇంకొన్ని చోట్ల లెక్క‌లు తీస్తే ఇలా ఉన్నాయి.. ఇవి కూడాఏపీ జీఈఏ అందించ‌న‌వే!

జీతంలో పెరుగుద‌ల కాద‌ని డీఏ బ‌కాయిలు క‌లుపుకుని తమ‌కు కొత్త పే స్లిప్ లో జీతం పెర‌గ‌నుంద‌ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే త‌మ‌ను, త‌మ ఇబ్బందినీ గుర్తించాల‌ని ఉద్యోగ సంఘాల‌కు ప్ర‌భుత్వం విన్న‌విస్తుంది. కానీ ఉద్యోగ సంఘాలు ఇవేవీ వినిపించుకోవ‌డం లేదు. త‌మ మాట మాత్ర‌మే నెగ్గాల‌న్న ఆలోచ‌న‌ల‌లో ఉన్నారు వీరంతా! దీంతో స‌మ‌స్య జ‌ఠిలం అవుతుందే త‌ప్ప ప‌రిష్కారానికి నోచుకోవ‌డం లేదు అన్న‌ది క‌ఠోర వాస్త‌వం.

డిసెంబర్ నెల పాత జీతం
————————————–
Sir I am working in Chittoor.
My salary statement
Basic Pay – 48600
DA 53.45%. – 25976
(Included
Five da’s)
HRA 20%. – 9720
IR 27%. – 13122
Total = 97418

ఇక కొత్త జీతం👇
—————————————
JANUARY 22 New salary
———————————————
Basic Pay – 74770
(23% fit)
DA five da’s. – 14969
(20.02%)
HRA 8%. – 5982
TOTAL. = 95721
January 22 diff=. -1697

తగ్గదు అని చెప్పేవారికి ఇది ఒక ఉదాహరణ..

ఈ విధంగా ఉద్యోగులు తాము న‌ష్ట‌పోతున్నామ‌ని చెబుతున్నారు.కొంద‌రు పెన్ష‌నర్లు అయితే ఇంకా ఎక్కువ స్థాయిలోనే తాము డ‌బ్బులు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. డ‌బ్బై వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ తాము డ‌బ్బులు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని కూడా అంటున్నారు. ఇవ‌న్నీనిజ‌మా లేదా కేవ‌లం భ‌యాందోళ‌న‌ల్లో భాగంగానే వీరు ఇలా మాట్లాడుతున్నారా అన్న‌ది తేలాల్సి ఉంది. కొత్త పీఆర్సీకి సంబంధించి పే స్లిప్ రానిదే ఎవ్వ‌రూ ఏమీ చెప్ప‌లేరు. అది వ‌చ్చేదాకా ఉద్యోగులు ఆగ‌లేక‌పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news