ఐపీఎల్ చరిత్రలో కేఎల్‌ రాహుల్‌ రికార్డు.. రూ.17 కోట్లకు కొనుగోలు

-

ఐపీఎల్‌ 2022 మెగా వేలం నేపథ్యంలో లీగ్‌ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్‌, లక్నో టీమ్స్‌ తమ డ్రాఫ్ట్‌ జాబితాలను ప్రకటించాయి. బీసీసీఐ రిటేన్షన్‌ నిబంధనల మేరకు ఇరు జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను పికప్‌ చేసుకున్నాయి. ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ న కు చెందిన లక్నో ఫ్రాంచైజీ కేఎల్‌ రాహుల్‌ ను రూ. 17 కోట్లకు తీసుకుంది. తమ టీమ్‌ కు కెప్టెన్‌ గా ఎంచుకుంది.

అతనితో పాటు మార్కస్‌ స్టోయినిస్‌ రూ.9.2 కోట్లకు తీసుకున్న లక్నో.. అన్ క్యాప్‌డ్‌ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అహ్మదాబాద్‌ టీం హర్ధిక్‌ పాండ్యా, రషీద్‌ కాన్‌ ను రూ.15 కోట్లకు శుభ్‌ మన్‌ గిల్‌ ను రూ.8 కోట్లకు తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. గత సీజన్‌ వరకు ఈ రికార్డు ఆర్‌సీబీ ప్లేయర్‌ కోహ్లీ పేరు మీద ఉంది. గత సీజన్‌ లో కోహ్లీ అత్యధికంగా రూ.17 కోట్లు అందుకోగా… ఈ సీజన్‌ లో మాత్రం రూ.15 కోట్లకే రిటైన్‌ చేసుకుంది. టీం కోసం కోహ్లీ వేతనం విషయంలో కాంప్రమైజ్‌ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news