ఏపీ కౌలు రైతులకు శుభవార్త..రుణాలు ఇవ్వాలని ఆదేశాలు !

-

ఏపీ కౌలు రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి అచ్చెన్న. మంత్రి అచ్చెన్న నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు…అనంతరం మాట్లాడారు. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని… సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

Minister Achchennaidu launched Apcab WhatsApp banking services

టీడీపీ హయాంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని… కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతుల రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వాలని… రేపటి నుంచే పరిస్థితి మారాలని తెలిపారు మంత్రి అచ్చెన్న. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చి దిద్దాలి….వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని పేర్కొన్నారు. డిజిటైలేజేషనుతోనే అక్రమాలకు చెక్ చెప్పగలమని… సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు మంత్రి అచ్చెన్న. APCOB సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version