పవన్ కళ్యాణ్ కి రాయాల్సిన లేఖ నాకు రాశారు – మంత్రి అమర్నాథ్

-

మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మాజీమంత్రి, కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్ పై అనవసరంగా విరుచుకుపడుతున్నారని, ఆయనకు రాజకీయాలలో నామమాత్రపు అనుభవం ఉందని హరి రామ జోగయ్య తీవ్రంగా దుయ్యబట్టారు. ” నువ్వు రాజకీయాలలో బచ్చావి. పైకి రావలసిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురదల్లే ప్రయత్నం చేయకు. నీ మంచి కోరి చెబుతున్న” అని రేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.

ఆయన రాసిన లేఖ కి సమాధానం ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ” పవన్ కళ్యాణ్ కి చెప్పాల్సినవి నాకు చెబుతున్నారు. కాపుల విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ కు రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు మీరు మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని లేఖలో పేర్కొన్నారు అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version