ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హరి దీప్ సింగ్ పూరీలను ను కలిసాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం అని అన్నారు. రేషన్ సరఫరా పై త్వరలోనే రాష్ట్రం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కందిపప్పు కొరత ఉంది. 150 రూపాయలకే కిలో కందిపప్పు రాష్ట్రంలో అందిస్తున్నాం.
లక్ష మెట్రిక్ టన్నుల కంది పప్పు ఏపి కి కేటాయించాలని కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి ని కోరాం. మొన్నటి బడ్జెట్ లో గిడ్డంగుల కోసం కేటాయించిన నిధుల్లో సింహభాగం కేటాయించాలని కోరాం. విభజన తర్వాత రేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరిగింది. Nfsa రేషన్ కార్డులు తగ్గిపోయాయి. పేదలకు ఇబ్బంది కలగకుండా కోటి 47 లక్షల రేషన్ కార్డులకు రాష్ట్రం సరఫరా చేస్తోంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి రేషన్ కార్డులు అమలు చెయ్యాలని కోరాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.