గత పాలకులకు తిరుపతి దేవస్థానంపై శ్రద్ధ లేదు: నాదెండ్ల మనోహర్

-

తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా , తెనాలి వైకుంఠ‌పురం దేవస్థానంలో తలపెట్టిన మ‌హాయాగంలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలకులకు తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ, లడ్డు తయారీపై లేదు. ప్రధాన దేవాలయాల్లో సంప్రోక్షణ యాగాల చెయ్యాలని దేవాదాయ శాఖ ఆదేశాలతో తెనాలి వైకుంఠ‌పురంలో మహా యాగం నిర్వహించాం.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహా యాగం చేపట్టాం.

వందల ఏళ్ళ నుంచి స్వామివారికి లడ్డు రూపంలో అందించే మహా ప్రసాదం కోట్లాది భక్తులు భక్తి భావంతో హృదయానికి అద్దుకొని స్వీకరిస్తారు. మన పూర్వీకులు లడ్డు ద్వారా మన సంస్కృతి ధర్మం తో అందించటం జరిగింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పై ఉంది. తిరుమల దేవస్థానం విషయంలో కేవలం అహంకారంతో చేసిన పనులివి. వారి స్వార్థాల కోసం పాలకులు ఆలయాలను ఉపయోగించుకుంటున్నారు అని మనోశారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version