సినీనటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే శ్రీదేవి నటన అద్భుతంగా ఉంది – మంత్రి అమర్నాథ్

-

ఎమ్మెల్సీ ఎన్నికలలో సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి అనేదానికంటే ఊసరవెల్లి శ్రీదేవి అని పేరు మార్చుకుంటే బెటర్ అని సూచించారు. సినీ నటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నటన అద్భుతంగా ఉందని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే శ్రీదేవికి నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడెలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు.

ఊసరవెల్లిలు అన్నీ కూడా పెద్ద ఊసరవెల్లి వద్దకు చేరుకున్నాయని విమర్శించారు. శ్రీదేవి పసుపు కండువా వేసుకుని జనంలోకి వెళ్ళినప్పుడు అసలు సంగతి తెలుస్తుందని చెప్పారు. ఓటుకు నోటు ఆఫర్ చేశారని స్వయంగా ఎమ్మెల్యే రాపాక చెప్పాక ఇక కొత్తగా చర్చలు ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ఆమె ఎంత హడావిడి చేశారో అందరూ చూశారని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news