అకౌంట్ లో డబ్బులు జమ కానీ వారికి గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్గాల  కారణంగా విజయవాడలో వరదలు  అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయనిధికి పలువురు దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందిస్తోంది.

ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలతో  నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురి బ్యాంక్ ఖాతాల్లో  ఇప్పటికే నగదు జమ చేసింది. అయితే పలు కారణాలతో నగదు జమ కాని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్ లో  జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు. అటు వరద సాయంలో పాల్గొన్న వారితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version