తాత అరెస్టు గురించి దేవాన్ష్‌కు చెప్పలేదు : నారా భువనేశ్వరి

-

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నారా కుటుంబం నిర్విరామంగా పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి గుండెపగిలి మరణించిన టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానుల కుటుంబాలను నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేస్తూ  ఆయన సతీమణి నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన సభలో పలువురు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి సమాధానమిస్తూ.. చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్‌ కల్యాణ్‌ తమకు అండగా నిలిచారని తెలిపారు. తాత ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్‌ అడుగుతున్నాడని.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదని చెప్పారు. చిన్న వయసు కావడంతో తనకు చెప్పదల్చుకోలేదని.. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నామని భువనేశ్వరి వెల్లడించారు. దసరా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చంద్రబాబు లేఖ రాస్తే వైసీపీ సర్కార్ ఆ లేఖపై కూడా విచారణ జరుపుతోందని భువనేశ్వరి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version