బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికై రికార్డ్ సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బాధ్యతలుస్వీకరించారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్ – 3 ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునాక్కు 150కిపైగా ఎంపీల మద్దతు లభించింది. మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్ వందమంది ఎంపీల మద్దతు కూడ గట్టలేక పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో బ్రిటిష్ ప్రధానిగా సునాక్కు మార్గం సుగమమైంది. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషిసునాక్ ఎన్నిక కావడం సంతోషకరమని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. భారతీయ వారసత్వ తొలి ప్రధానిగా బ్రిటన్ ను ముందుకు నడిపించడానికి సిద్ధమవుతున్న రిషి సునాక్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.