రాయలసీమకు గుక్కెడు నీళ్లు ఇవ్వని దద్దమ్మ జగన్‌ – నారా లోకేష్‌

-

 

రాయలసీమకు గుక్కెడు నీళ్లు ఇవ్వని దద్దమ్మ అని జగన్‌ పై ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌. హంద్రీనది చెంతనే ఉన్న గుక్కెడు నీళ్లివ్వల్లేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అయితే, వర్షపునీటిని ఒడిసిపట్టి రాయలసీమకు జలకళ తెచ్చిన అపర భగీరథుడు మన చంద్రన్న అని కోనియాడారు లోకేష్‌. కరువుసీమలో కళకళలాడుతున్న ఈ జలాశయం కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం శివార్లలో ఉంది.

కొండల్లో నుంచి వచ్చే వర్షపునీటికి చెక్ డ్యామ్ నిర్మాణం ద్వారా అడ్డుకట్టవేసి, సుందరమైన సరస్సుగా మార్చారు చంద్రబాబునాయుడు అని ప్రశంసించారు. ఈ ప్రాంతంలో ఆహ్లాదమైన బోటింగ్ ఏర్పాటుచేసి, టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేశారు. చంద్రబాబు గారి దార్శనికతకు ఇదొక మచ్చుతునక మాత్రమేనని వెల్లడించారు లోకేష్‌. ముస్లిం మైనారిటీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతోంది. మదనపల్లె మండలంలో అక్రమ్ అనే యువకుడిని వెంటాడి వేటాడి హత్య చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news