మొన్న శివ…నేడు వీరేంద్ర…నారా లోకేష్ మంచి మనసు

-

ఇటీవల కువైట్ లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఓ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై స్పందించారు మంత్రి నారా లోకేష్.  ఏపీ ప్రభుత్వం చొరవతో కువైట్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ కువైట్ నుంచి తన స్వగ్రామానికి చేరుకున్నారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేసిన విషయం విదితమే. ఈ పోస్టు మంత్రి నారా లోకేష్ స్పందించారు.

తాజాగా సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.  నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నా అంటూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసాడు వీరేంద్ర కుమార్. ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడేశారని వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేసాడు వీరేంద్ర. వీరేంద్ర వీడియో చూసి స్పందించాడు మంత్రి నారా లోకేష్. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version