మహిళలను బెదిరించిన మంత్రి జోగి రమేష్..వీడియో వైరల్

విజయవాడకు చెందిన మహిళలను బెదిరించారు మంత్రి జోగి రమేష్. విజయవాడలో జరిగిన చేయూత కార్యక్రమం నిన్న జరిగింది. ఈ సందర్భంగా మహిళలను బెదిరిస్తూ.. మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. వీడియో వైరల్‌ గా మారింది. అయితే.. దీనిపై నారా లోకేష్‌ స్పందించారు.

మంత్రైనా జోగి లేకి పనులు మానుకోలేదని ఆగ్రహించారు. విజయవాడలో జరిగిన చేయూత కార్యక్రమంలో వైసిపి నేతల అబద్ధాలు వినలేక మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలను బెదిరించారని మంత్రి జోగి రమేష్ పై నిప్పులు చెరిగారు.

తిరిగి వచ్చి కూర్చొని మీటింగ్ లో చెప్పేది వినకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ బెదిరించడం దారుణమన్నారు నారా లోకేష్‌. అసలే రాష్ట్రంలో రక్షణ లేదని ఆందోళన చెందుతున్న మహిళలని ఏకంగా మంత్రులే బెదిరించడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదనే విషయం మరోసారి స్పష్టమైందని వెల్లడించారు లోకేష్‌.