ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్

-

జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు తరహాలోనే ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news