అమరావతి ఎంపీ నవనీత్‌ రాణాపై నాన్‌ బెయిల్‌ వారెంట్‌

-

ఏపీలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు ముంబయి కోర్టు నాన్​బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో నవనీత్​పై, ఆమె తండ్రిపై నాన్​బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెప్టెంబర్‌లోనూ ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వారెంట్‌ జారీ అయ్యింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కేసుపై కోర్టులో సోమవారం రోజున మరోసారి విచారణ జరిగింది. వారెంట్‌ అమలు కోసం మరింత సమయం కావాలని పోలీసులు కోరారు.

పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నవనీత్‌ రాణాతో పాటు ఆయన తండ్రిపై తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. ఆ తర్వాత సర్వీస్ ఆఫ్‌ వారెంట్‌పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు. షెడ్యూల్డ్‌ కులాలకు రిజర్వ్‌ అయిన అమరావతి ఎంపీ స్థానంలో నకిలీ కులధ్రువీకరణ పత్రంతో పోటీ చేసినట్లు నవనీత్​పై ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో బాంబే హైకోర్టు నవనీత్‌ రాణాకు జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రాన్ని రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news