అమానుషం.. ఊయలలో ఉండగానే ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం

-

విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర రక్తస్రావమైంది. ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రామభద్రాపురం మండలంలో శనివారం రోజున ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని ఈ సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారిపై అత్యాచారం చేయగా ఆ పాప బిగ్గరగా ఏడ్చింది. పాప ఏడుపు విని చిన్నారి అక్క అక్కడికి చేరుకుని తల్లిని పిలుచుకు వచ్చింది.

ఈ క్రమంలో తల్లితో పాటు గ్రామస్థులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా.. పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల నుంచి వివరాలు సేకరించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version