ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చారు : రోజా

-

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో నిత్యం హత్యలు, వివాదాలు, అత్యాచారాలు, తదితర సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవలే బహిర్భూమికి వెళ్లిన ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తెలిసిందే. అలా నిత్యం ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో మహిళలపై దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

నిన్న కడప జిల్లా బద్వేల్ లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని పై యువకుడు పెట్రోల్ పోసీ నిప్పంటించడంతో చికిత్స పొందుతూ ఇవాళ మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు నిందితుడినీ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై మాజీ మంత్రి రోజా స్పందిస్తూ.. సంచలన వ్యాక్యలు చేశారు. బద్వేల్ లో ఉన్మాది దాడిలో యువతి చనిపోయిందని ఫైర్ అయ్యారు. మీడియాతో బాధితురాలి తల్లి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె రోదిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీ చెవులకు వినిపిస్తుందా చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణలేదు.. వరుస మానభంగాలు, హత్యలతో అత్యాచారాంధ్రప్రదేశ్ గాి మార్చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version