పవన్ మాట: ఇది సమయం కాదు మిత్రమా!

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడితే.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఇది సమయం కాదు మిత్రమా అంటూ బహిరంగ లేఖను విడుదల చేశారు.

pawan-kalyan
pawan-kalyan

అయితే ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అధికార వైసీపీ నేత‌లు ఇది చారిత్రాత్మక నిర్ణయం అంటూ శుభ పరిణామాన్ని ఆహ్వానిస్తూ.. సంబ‌రాలు జరుపుకుంటున్నారు. ప్రతిప‌క్ష తెలుగుదేశం పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇక‌, బిల్లుల‌కు ఆమోదం తెల‌‌ప‌డంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి రాజీనామా కూడా చేశారు.

అదేవిధంగా బీజేపీలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక‌ మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంపై ఏకంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అందులో ముఖ్యంగా… ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి.. మూడు రాజధానులకు ఇది సమయం కాద‌ని పవన్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

అదేవిధంగా గతంలో జ‌రిగిన రాజ‌ధానుల నిర్మాణాన్ని ప్ర‌స్తావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. గుజరాత్ రాజధాని గాంధీనగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్‌ ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని తన ప్రకటనలో పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు కావాల్సిందేనని వైఎస్ జగన్.. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు తప్ప చంద్రబాబు దృష్టికోణాన్ని మాత్రం వక్కాణించకపోవడం విచారకరం అంటున్నారు వైసీపీ శ్రేణులు.

అదేవిధంగా.. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని చెబుతున్నారు పవన్. కాగా ఈ రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత రైతుల స‌మ‌స్య‌ల‌పై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి.. ఓ నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని.. రైతుల పక్షాన పోరాడుతామ‌ని పవన్ కల్యాణ్ ప్రకటన ద్వారా వివరించారు.