పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకువచ్చారు అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీతో ఎందుకు అంటకాగారన్నది ఇప్పటికీ జనసైనికులకు అంతుపట్టని విషయం. దాన్నే వారు ఆత్మహత్యాసదృశ్యంగా ఇప్పటికీ చూస్తున్నారు! సరే అది చెడింది.. మళ్లీ బీజేపీ పంచన చేరారు! కాస్త నాలుగురోజులు క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తలా జాగ్రత్తనే ఉన్నారు! కానీ… పవన్ మళ్లీ పునరాలోచనలో పడ్డారంట!
అవును… జాతీయస్థాయిలో బీజేపీ – వైకాపాలు రాసుకుపూసుకు తిరుగుతుండటం… అంటు చంద్రబాబుకు ఎంత ఇబ్బందిగా ఉందో అంతకుమించి పవన్ కి కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు విశ్లేషకులు! పవన్ రాజకీయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. “జగన్ ఏది చెప్పినా.. దాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే”! జగన్ బొమ్మ అని అంటే… పవన్ బొరుసు అంటారు! జగన్ బొరుసు అంటే.. పవన్ బొమ్మ అంటారు! ఇదే పవన్ మార్కు రాజకీయంగా మారిపోయింది!
ఈ సమయంలో స్వయంగా మోడీనే జగన్ ను ఆకాశానికెత్తేస్తుంటే… ఏపీలో జగన్ పాలన భేష్ అని చెప్పేస్తుంటే… మిత్రధర్మం వల్ల పాన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారంట! జగన్ పాలన వరస్ట్ అని పవన్ చెప్పాలని అనుకుంటే… ఆయన అధినేత మోడీ ఏమో సూపర్ సూపర్ అని అంటే… పవన్ కి చాలా ఉక్కపోతగా ఉందని అంటున్నారు!! ఈ సమయంలో బీజేపీతో పొత్తు లేకపోతే.. బండి నడవదు! పొత్తులో ఉందామంటే… జగన్ ని ఏమీ అనకూడని పరిస్థితి!! దీంతో బీజేపీ విషయంలో పవన్ పరిస్థితి ఆటలో అరటిపండులా అయిపోయిందని అంటున్నారు!
-CH Raja