BREAKING: ప్రధాని ఆఫీస్ నుంచి టీడీపీ ఎంపీలకు ఫోన్

-

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వాళ్లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. వారిలో టీడీపీ ఎంపీలు కే.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అదేవిధంగా నితిన్ గడ్కరీ, శర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, జితేంద్ర సింగ్, హెచ్‌డీ కుమార స్వామి(జేడీఎస్), ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన షిండే వర్గం)లకు ఫోన్ వచ్చింది. కాగా వీరికి మోదీ తన నివాసంలో తేనేటి విందు ఇచ్చారు.

ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి రెండు పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవి రేసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్జీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. అయితే వీరిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ ఇద్దరికే కొత్త కేబినెట్‌లో చోటుదక్కినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version