ప్రజారాజ్యం లాగే..జన సేన కూడా 12 నెలల్లో అంతం కాబోతుంది!

-

ప్రజారాజ్యం లాగే..జన సేన కూడా 12 నెలల్లో అంతం కాబోతుందని పోతిన మహేష్ విమర్శలు చేశారు. పవన్ టీడీపీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టికెట్లను ఇచ్చారు…జన సేన ప్రజారాజ్యం పార్టీ 2 అవుతుందని హెచ్చరించారు. 12 నెలల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతు అవు తుంది… త్యాగాలు చేయటానికి బీసీలు మాత్రమే కావాలా? అని నిలదీశారు. పవన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.

pothina slams pawan

భీమవరం సీటు కూడా జనసేనకు ఇవ్వకుండా టీడీపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. 2014లో పోటీ చేయక పోయినా, 2019లో ఒక సీటు వచ్చినా పవన్ తో నడిచి మేం భంగ పడ్డామన్నారు. నటించే వాడు నాయ కుడు అవలేడు..నమ్మకం కలిగించే వాడు మాత్రమే నాయకుడు అని చురకలు అంటించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్… ఇలాంటి పాషాన హృదయం కలిగిన వ్యక్తితో ప్రయాణం చేసిన మాకు మాపై అసహ్యం కలుగుతోందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version