మీరు బెదిరిస్తే బెదిరి పోవాలా? – రఘురామకృష్ణ రాజు

-

సాక్షి దినపత్రిక, సీఐడీ పోలీసులు బెదిరిస్తే, బెదిరిపోవాలా? అంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. సీఐడీ పోలీసుల వేధింపులను తాళలేక మార్గదర్శి సంస్థ ఆడిటర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారని, ఇదే విషయాన్ని చార్టెడ్ అకౌంటెంట్లతో పాటు, న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడైన ప్రొఫెసర్ శాస్త్రి అనే వ్యక్తి రామోజీరావు గారిని రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్న తీరును వివరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారని, ఆర్థిక నేరాల కేసులలో జగన్ మోహన్ రెడ్డి గారు అభియోగాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

 

అయినా తమ పార్టీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారిని నిర్దోషి అని పేర్కొనడం జరుగుతోందని, సీఐడీ ప్రాతిపదిక ప్రకారం జగన్ మోహన్ రెడ్డి గారు నిర్దోషని పేర్కొన్న వారందరికీ సీబీఐ నోటీసులు ఇవ్వాలని, సీబీఐ నేడు వారికి నోటీసులు జారీ చేస్తే, రేపు సీఐడీ అధికారులు తమకు నోటీసులను జారీ చేస్తారేమో? అని అన్నారు. మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వై.యస్. అవినాష్ రెడ్డి గారికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తనకున్న వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకొని మద్దతు ప్రకటించారని, వై.యస్. అవినాష్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి గారికి సీబీఐ నోటీసులు జారీ చేస్తే, రామోజీరావు గారికి మద్దతు ప్రకటించిన తమకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేయవచ్చునని అన్నారు. తమ ప్రాథమిక హక్కుల గురించి ప్రశ్నించే అధికారం సీఐడీకి లేదని, రామోజీరావు గారు, మార్గదర్శి సంస్థ తప్పు చేసిందనే ఆధారాలు ఉంటే సీఐడీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేసుకోవచ్చునని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version