నేడు ఏపీకి భారీ వర్ష సూచన..ఆ జిల్లాలకు హెచ్చరికలు జారీ

-

ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఏపీ లోని పలు ప్రాంతాల్లో శనివారం విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మిగతా చోట్ల అక్కడక్కడా స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది వాతావరణ శాఖ. ఇక అటు రాగల రెండు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news