ఏపీ ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఇక అటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అతిపెద్ద స్కాం అని, ఈ స్కామ్ లో రాజకీయ ప్రమేయం ఉందని పేర్కొన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.