ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ నియంత్రనకు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యకు రాష్ట్ర ఆయూశ్ శాఖ షాక్ ఇచ్చింది. ఓమిక్రాన్ వేరియంట్ మందుకు ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించింది. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కు ఆయుర్వేద మంది పంపిణీ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆయూశ్ శాఖ సీరియస్ అయింది. ఇప్పటి వరకు ఆయూశ్ శాఖ ఓమిక్రాన్ వేరియంట్ కు ఎలాంటి ఆయూర్వేద మందులకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది.
అలాగే ఓమిక్రాన్ వేరియంటకు సంబంధించిన ఆయుర్వేద మందులకు రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించింది. గుర్తింపు లేని ఆయుర్వేద మందులకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఆయూశ్ శాఖ అనుమతి ఉన్న మందులనే వాడాలని తెలిపింది. అలాగే వైద్యులను సంప్రదించిన తర్వాతే ఓమిక్రాన్ వేరియంట్ కు గానీ కరోనా వైరస్ కు గానీ మందులు వాడాలని సూచించింది.