చంద్రబాబు త్యాగాల వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారని… ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించామని చురకలు అంటించారు సోము వీర్రాజు. ఇక గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్దంగా లేదని స్పష్టంగా చెబుతున్నామని.. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉందని వెల్లడించారు.
కుటుంబ పార్టీలకోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సోము వీర్రాజు. త్యాగ ధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
2024 లో మోడీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటన చేశారు సోము వీర్రాజు. పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతును పూర్తిగా మోసగించారు.
గతంలో చంద్రబాబు, నేడు జగన్ ప్రభుత్వాలు ఈ అంశంలో దగ చేస్తున్నాయని ఆగ్రహించారు సోము వీర్రాజు.