ఏపీ అడ్వాంటేజ్…కానీ జగన్ మాత్రం డిస్ అడ్వాంటేజ్ – కాల్వ

-

ఏపీ అడ్వాంటేజ్…కానీ జగన్ మాత్రం డిస్ అడ్వాంటేజ్ అని..టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి కామెంట్స్ చేశారు. నాలుగేళ్లుగా చీకటి మాయమైన రాష్ట్రంలో వెలుగు నింపాలని సిఎం విఫల ప్రయత్నం చేశారు…ప్రభుత్వం ఆహ్వానం మేరకు పెట్టుబడి దారులు వచ్చారు కానీ,, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులు పెడతారని మేము ఆనుకోడం లేదని వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ కంటే ముందే రాష్ట్రం పారిశ్రామిక విధానం ఏమిటో వెల్లడించకుండా ఎలా పెట్టుబడి పెడతారన్నారు.


నాలుగేళ్లుగా మౌనంగా ఉండి ఈ ఎన్నికల ఏడాదిలో ఈ ప్రయత్నాలు ఏమిటని… ఇప్పటి దాకా ఎంతో మంది పెట్టుబడి దారులు పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టింది వాస్తవం కదా…అని నిలదీశారు. గ్లోబల్ సమ్మిట్ లో కనీసం పారిశ్రామిక వేత్తలకు భోజనం పెట్టే పరిస్తితుల్లో పెట్టుబడి ఎలా పెడతారు..సొంత జిల్లా కడపలో ఇచ్చిన వేల కోట్ల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. దేశంలోనే తొమ్మిది లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ అంటే రెండు లక్షల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి.. ఇది సాధ్యమేనా..వచ్చే ఎన్నికల లోపల 13 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం పది శాతం పెట్టుబడులు అయినా తీసుకు రాగలుగుతారా…అని ఆగ్రహించారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news