శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

-

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం పాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు సోమవారం రోజున మూడు గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి, స్పిల్‌వే ద్వారా 80,794 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ (మంగళవారం) మరో 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం 5 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ఈ ప్రవాహం ప్రవహిస్తోంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులుగా ఉంది. అదే విధంగా నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.9 టీఎంసీలకు చేరింది. కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 61,457 క్యూసెక్కుల నీరు సాగర్​కు విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version