ఏపీ ప్రభుత్వం మరో రూ. 3 వేల కోట్లు అప్పుచేసింది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీస్ వేలంలో ఈ మొత్తాన్ని సమీకరించింది. పదేళ్ల కాల పరిమితితో 7.33% వడ్డీకి రూ. 500 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితితో 7.36% వడ్డీకి రూ. 1,000 కోట్లు, 19 సంవత్సరాల కాలపరిమితితో 7.33% వడ్డీకి మరో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాల పరిమితితో 7.33% వడ్డీకి రూ. 1,000 కోట్లను అప్పుగా తీసుకుంది.
కాగా, ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సచివాలయంలోని బ్యాక్-1లో సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఓవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం… మరోవైపు జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ఆసక్తిని కలిగిస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత… చాలాకాలం నిరీక్షణ తర్వాత జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపైనే చర్చిస్తారని తెలుస్తోంది. కొత్త పిఆర్సిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై చర్చించి… ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతారని ప్రచారం జరుగుతోంది.