నేటి నుంచి ఏపీలో కుల గణన ప్రక్రియ ప్రారంభం

-

ఏపీ ప్రజలకు అలర్ట్‌. ఏపీలో ఇవాళ్టి నుంచే కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఇవాళ 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభం అవుతుంది. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన జరుగనుంది.

The process of caste enumeration has started in AP from today

కుల గణనపై ఈ నెల 22 వరకు శిక్షణ ఇస్తారు.రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు జరుగుతాయి. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, ఈ నెల 20న విజయవాడ, విశాఖ, 24న తిరుపతి లో ప్రాంతీయ సదస్సులు ఉంటాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కుల గణన ప్రక్రియ ను విజయవంతం చేయాలని ఇప్పటికే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా.. విజయవంతం చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version