టిడిపి నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో నినాదాలు చేసిన వారిపై అత్యాయత్నం కేసు నమోదు చేసి, విజయవాడలో కన్ను పొడిచిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇస్తారా? అని ప్రశ్నించారు. “కన్ను పొడిచినా స్టేషన్ బెయిల్…..నినాదాలకే హత్యాయత్నం కేసు. ఇలాంటి పోకడలతో రాష్ట్రంలో పోలీసు అధికారులు మరోసారి తామేంటో….తమ శాఖ తీరేంటో..తాము ఎటువైపో స్పష్టంగా చెప్పారు.
కుప్పంలో సాధారణ నిరసనలు చేపట్టిన వారిపై హత్యాయత్నం సెక్షన్ పెట్టి రిమాండ్ కు పంపిన పోలీసులు… విజయవాడలో దాడిచేసి కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ రెండు ఘటనల్లో ఖాకీల తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ. ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు మరీ ఇంతగా సాగిలపడడాన్ని ప్రజలు ఎవరూ ఆమోదించరు. ఏపీ పోలీస్ అనే బ్రాండ్ సర్వనాశనం కావడానికి, ప్రజలకు పోలీసులపై నమ్మకం పోడానికి ఈ ఘటన చాలు. మీరు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని గుర్తించండి. చట్టప్రకారం పని చెయ్యండి.”. అని ట్వీట్ చేశారు నారా చంద్రబాబు.
https://twitter.com/ncbn/status/1567802089207889921?s=20&t=F_iHDHxPPplHdKktpwGvaw