శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఈ నెల15 నుంచి పలు సేవలు రద్దు

-

తిరుమల శ్రీవారిని భక్తులకు అలర్ట్. ఈ నెలలో మూడ్రోజుల పాటు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీటీ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తిరుమల ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆగ‌స్టు 14న అంకురార్పణంతో ప్రారంభం కానున్నాయి. 15న పవిత్రాల ప్రతిష్ఠ, ఆగ‌స్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు జరగనున్నాయి.

పవిత్రోత్సవాల సందర్భంగా తిరుమలలో ఆగ‌స్టు 14న అంకురార్ప‌ణ కార‌ణంగా.. సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. ఆగ‌స్టు 15న తిరుప్పావడతోపాటు ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు తెలిపింది. మరోవైపు తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్టు 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జ‌రగ‌నుండటంతో అర్చక బృందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version