కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పత్తికొండ-కర్నూలు రహదారిపై యురేనియం కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జనాలు. కదలి వచ్చిన వేలాది మంది ప్రజలు… పత్తికొండ-కర్నూలు రహదారిపై యురేనియం కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కప్పట్రాళ్ల, పి.కోటకొండ, బేతపల్లి, చెల్లెలి చెలిమ గ్రామాల ప్రజల ఆందోళనతో పత్తికొండ-కర్నూలు రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
పత్తికొండ-కర్నూలు రహదారిపై కిలోమీటర్ పొడవునా నిలిచిపోయాయి వాహనాలు. ఇక ఈ ఆందోళనలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలను అనుమతించేది లేదని భీష్మించారు ప్రజలు. ఆందోళన విరమించాలని పోలీసులు చేస్తున్న విజ్ఞప్తిని లెక్కచేయని ఆందోళనకారులు….కప్పట్రాళ్ల వద్ద 2 గంటలుగా ఆందోళన చేస్తున్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కలెక్టర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… రోడ్డుపై బైఠాయించారు వృద్ధులు, పిల్లలు, మహిళలు.
కప్పట్రాళ్ల వద్ద ఉద్రిక్తత
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులో యురేనియం తవ్వకాలపై సమీప గ్రామాల ప్రజలు యుద్ధం ప్రకటించారు. యురేనియం తవ్వకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కప్పట్రాళ్ల బస్టాప్ వద్ద దాదాపు పది గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. గ్రామస్థుల ఆందోళనతో… pic.twitter.com/NL6tMEQTqm
— ChotaNews (@ChotaNewsTelugu) November 2, 2024