వైద్యుల నియామకాల్లో చరిత్ర సృష్టించిన ఘనత ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారికే దక్కుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరతను అధిగమించేందుకు బిడ్డింగ్ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు విడదల రజినీ.
వైద్య ఆరోగ్యశాఖ కు సంబంధించిన అన్ని విభాగాల అధిపతులతో శుక్రవారం వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంత్రి విడదల రజిని గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానంపై తీసుకోవాల్సిన చర్యలు, నాడు- నేడు పనుల పురోగతి, ఆస్పత్రుల్లో సౌకర్యాల ఏర్పాటు, పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లాంటి అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు గారు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్ గారు, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్ గారు, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి గారు, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ గారు, డీహెచ్ రామిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.