ఇంకో 6 నెలల్లో TDP ముక్కలు కాబోతుంది – విజయసాయిరెడ్డి

ఇంకో 6 నెలల్లో TDP ముక్కలు కాబోతుందని విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంకో 6 నెలల్లో పచ్చ పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఫ్యూచర్ కోరుకునే నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోతారు. బాబు మంత్ర దండం ‘తంత్ర’ శక్తిని కోల్పోయింది. వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ పవర్ సన్నగిల్లింది. ప్రజల్లో ఆదరణ లేదు. ఎలక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం లేదని క్యాడర్ కు అర్థమైందని ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో తండ్రిని మించిపోయాడు పప్పేశ్. మెదడులో చిప్ లేకున్నా ఊహాశక్తికి పదును పెట్టి కమ్మని కథలు వినిపిస్తున్నాడు. ప్రజల దగ్గరకు వెళ్లండి బాబూ. ఓడినా ఎప్పుడైనా వెళ్తే గుర్తుపట్టి పలకరిస్తారు. టీవీ ఛానెళ్లను మేపి జనానికి దూరం కాకండి. పొగడ్తల మాయలో పడ్డోడు రాజకీయంగా ఫినిష్ అయినట్టే అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.